Friday, 16 March 2018

చాలామందిని సీనియర్లను కలిశా, అదీ మాట్లాడుతా: పీఆర్పీపై పవన్ కళ్యాణ్

అమరావతి: ఏపీలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఓ ఛానల్ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ఏపీలో మొదటిసారి ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజకీయాలపై మాట్లాడారు. టీడీపీ అవినీతి విషయమై తాను ప్రజల మాటనే చెప్పానని అన్నారు. నేను చెప్పడం వల్లే ఎక్కువగా అనుకుంటున్నారేమో కానీ, అందరి దృష్టిలో ఉందన్నారు.
నేను అంత త్వరగా ప్రభావితం కాను

నేను అంత త్వరగా ప్రభావితం కాను

శేఖర్ రెడ్డి లాంటివి ఉన్నవి చూసుకోమని మాత్రమే తాను చెప్పానని పవన్ అన్నారు. ఐవీఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలకు తాను ప్రభావితం కాలేదని, తాను అంత త్వరగా ఎవరికీ ప్రభావితం కానని చెప్పారు.
 పీఆర్పీలో చాలామందిని కలిశా

పీఆర్పీలో చాలామందిని కలిశా

ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు తాను చాలామంది సీనియర్ నాయకులను కలిశానని, డబ్బులు ఒక్కటే ఎన్నికలను ప్రభావితం చేయలేవని పవన్ చెప్పారు. పార్టీకి మంచి సిద్ధాంతాలు ఉండాలని, ప్రజల్లో నమ్మకం కలిగించాలని చెప్పారు.
ఫిరాయింపులపై మాట్లాడుతా

ఫిరాయింపులపై మాట్లాడుతా

పార్టీ ఫిరాయింపులపై తాను తర్వాత మాట్లాడుతానని పవన్ చెప్పారు. నా స్థాయి ఏమిటో నాకు తెలుసునని, నా స్థాయికి తగినట్లుగా మాట్లాడుతానని చెప్పారు. ప్రత్యేక హోదాపై జాతీయస్థాయిలో పార్టీలు ఏకం అవుతున్నాయని, అన్ని పార్టీల్లో కదలిక వచ్చిందన్నారు.
జనసేన బ్యాలెన్స్‌గా

జనసేన బ్యాలెన్స్‌గా

2019లో ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తాననే విషయమై సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతానని పవన్ అన్నారు. పీఆర్పీలా కాకుండా, జనసేన బ్యాలెన్స్‌గా వెళ్తుందని అభిప్రాయపడ్డారు. తనపై ఐటీ దాడులు జరిగాయని చెప్పలేదని, ఆ ఆలోచన వస్తుందని మాత్రమే.
English summary
Jana Sena chief Pawan Kalyan responded on Praja Rajyam and MLAs defections in an interview.

No comments:

Post a Comment

చాలామందిని సీనియర్లను కలిశా, అదీ మాట్లాడుతా: పీఆర్పీపై పవన్ కళ్యాణ్

అమరావతి: ఏపీలో తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఓ ఛానల్ యాప్‌ను లాంచ్ చేశారు. ఈ స...